02-05-2025 12:39:24 PM
ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరీ వెంకట్రామ నరసమ్మ
తుంగతుర్తి,విజయక్రాంతి: వెంపటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడల శిక్షణ శిబిరాన్ని(free Kabaddi training camp) విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరీ వెంకట్రామ నరసమ్మ శుక్రవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో కబడ్డీ క్రీడాకారుడు శిక్షణ శిబిరం డైరెక్టర్ చిటిపాక మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానికలతో కలిసి రామనరసమ్మ ప్రారంభించి మాట్లాడారు.క్రీడలకు, ఉద్యోగాలకు నిలయమైన వెంపటి గ్రామంలో జిల్లాలోనే ఏ గ్రామంలో నిర్వహించనీ విధంగా మన గ్రామంలో పేద విద్యార్థులకు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డైరెక్టర్ చిటుపాక మహేష్ మాట్లాడుతూ...పిల్లలకు వేసవి శిక్షణ శిబిరంలో ఖో-ఖో,వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, క్రీడలలో శిక్షణ ఇస్తారనీ అన్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయడానికి వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పిల్లలను చరవాణి, చెడు వ్యసనాల వైపు వెళ్ళకుండా, క్రీడలపై ఆసక్తి కల్పించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.