05-04-2025 05:16:28 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మూడవ జోన్ రామాలయం సమీపంలో నివాసముండే నిరుపేద కుటుంబానికి యూత్ ఫర్ సొసైటీ సభ్యులు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి శనివారం 5 వేల రూపాయలు అందచేశారు. ఈ సందర్బంగా సంస్థ సభ్యులు మాట్లాడారు. నిరుపేద కుటుంబానికి చెందిన పాలితపు కుమారస్వామి- భవాని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు అఖిలేష్ గత రెండు నెలల క్రితం శ్రీరాంపూర్ లో గల కళాశాల కు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
ఈ ప్రమాదంలో బాధితుడి వెన్నుపూస, డిస్క్ మెదడు, నరాలు తీవ్ర గాయాలయ్యాయన్నారు. అసలే పేదరికం ఆపై ఇల్లు గడవడం కష్టమవుతున్న పరిస్థితుల్లో కొడుకు తీవ్ర గాయాల పాలవడం కుటుంబానికి ఆర్థికంగా కష్టంగా మారిందని, స్థానికుల ద్వార సమాచారం తెలుసుకొని బాధిత కుటుంబానికి తమ వంతుగా సహాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ సభ్యులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్, సొత్కు ఉదయ్, మంద మహేందర్, చోటు, ఒజ్జ గణేష్, రాజేష్, కళ్యాణ్, చింటూ, సుజిత్, సాత్విక్, మహేష్ లు పాల్గొన్నారు.