05-04-2025 05:08:53 PM
బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ప్రకటించాలి..
కాంగ్రెస్ పార్టీతోనే దళితుల అభ్యున్నతి..
ఎస్సీ సబ్ ప్లాను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ..
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం..
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
గంగాధర మండలం మధురానగర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే
చొప్పదండి (విజయక్రాంతి): గంగాధర మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరైనారు. ఈ సందర్భంగా మండలంలోని మధురానగర్ నుండి గంగాధర మండల కేంద్రం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని మధురానగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గంగాధర మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని యువత సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని, ఎస్సీ సబ్ ప్లాన్ను అమలు చేసి గ్రామాల్లో దళిత కాలనీలను అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గత పదేండ్ల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వెలిచాల తిర్మల్ రావు, దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, రోమల రమేష్, దోమకొండ మల్లయ్య, ద్యావ శ్రీనివాస్, గంగాధర ప్రవీణ్, గంగాధర శంకర్, లింగాల దుర్గయ్య, ద్యావ సంజీవ్, గంగాధర శ్రీకాంత్, గంగాధర రమేష్, చిలుముల రాజయ్య, గంగాధర రఘు, శనిగరపు నరేష్, తాళ్ళ శ్రీనివాస్, తాళ్ళ స్వామి, తాళ్ళ నరేష్, తదితరులు పాల్గొన్నారు.