calender_icon.png 3 May, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో చేసిన కులగణననే దేశానికి రోల్ మాడల్

02-05-2025 12:57:57 PM

  1. రాహుల్ గాంధీ మాట ప్రకారమే రాష్ట్రంలో పాలన
  2. అప్పుడు చేసింది కేసీఆరే కదా
  3. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా గుర్తురాలేదు
  4. ఎమ్మెల్సీ కవిత ఎందుకు అండగా ఉండలే

హైదరాబాద్: తెలంగాణలో చేసిన కుల గణననే దేశానికి రోల్ మోడల్ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiahఅన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) ఎందుకు అండగా ఉండలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా గుర్తురాలేదన్నారు. అధికారం ఉన్నప్పుడు రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆరే కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి(Anumula Revanth Reddy) సారథ్యంలో రైతులు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో పాలన సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పని సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.