calender_icon.png 2 May, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ కిందపడి గ్రామపంచాయతీ కార్మికుడు దుర్మరణం....

02-05-2025 12:36:44 PM

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారి సబ్బితం గ్రామం వద్ద లారీ కిందపడి గ్రామపంచాయతీ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సబితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తున్న నరసయ్య  ఎప్పటిలాగే  శుక్రవారం తన విధుల్లో భాగంగా సైకిల్ పై వెళుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ టైర్లు నర్సయ్య మీదికి ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా మంథని - పెద్దపల్లి ప్రధాన రహదారి మార్గంలో లారీల రాకపోకలు తీవ్రం కావడం, అతివేగంగా వెళ్తుండడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.