02-05-2025 12:34:05 PM
ఎయిర్పోర్ట్ లో జూలియా ఈవేలిన్ కు ఘన స్వాగతం
రాజేంద్రనగర్: హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్(Miss World) 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి నేడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మురళికి సాంప్రదాయపద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల లో చేపట్టిన ఏర్పాటు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.