02-05-2025 12:59:49 PM
ఓఆర్ఆర్ పై కారు బోల్తాపడి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: ప్రాణం తీసిన అతివేగం..కారు బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన దేరంగుల తిరుమలేష్ (35), బ్రీజా కార్ లో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుండి బొంగులూరు (ఎగ్జిట్ 12) వద్దకు అతివేగంగా వస్తూ, కారు అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీ కొట్టి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుమలేష్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.