calender_icon.png 3 August, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగికదాడి కేసులో జైలు

06-12-2024 12:01:41 AM

నిర్మల్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. నిర్మల్ మండలంలోని  డ్యాంగాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ 2021లో ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. గురువారం విచారణ జరిపిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరినామా విధించింది.