21-08-2025 12:58:31 AM
-ఇతర విభాగాలకు అన్యమత సిబ్బంది
- వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద కూడా పంపుతాం
- ఏఐ ద్వారా భక్తులకు సులభ దర్శనం
- సైబర్ మోసాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్
- మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేయ డమో లేదా వాలంటరీ రిటైర్మెంట్ కింద పంపడమో చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయు డు పేర్కొన్నారు. ఏఐ ద్వారా శ్రీవారి భక్తులకు సులభ దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 1 గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
బుధవారం హైదరబాద్‌లో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల విష యంలో జరిగే సైబర్ మోసాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. టీటీడీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని నాయుడు హెచ్చరించారు. వైసీ పీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి పనిగట్టుకొని టీటీడీపై దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని, ఆయన అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉంద ని, తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధ మా అని సవాల్ విసిరారు.
తిరుమలలో హోటళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు ఈటెండర్లు చేపడుతున్నట్టు తెలిపా రు. గతంలో ఈ హోటళ్ల కేటాయింపు మాఫియాలా ఉండేదని ఆరోపించారు. ఉదయం 10 గంటలకు ఉండే వీఐపీ దర్శనవేళలను మార్చనున్నట్టు తెలిపారు. ఉదయం 8 నుం చి 8.30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభమవుతుందని పేర్కొన్నారు. టీటీడీ అనుబంధ ఆల యాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, తిరుమలలో కొత్త క్యాంటిన్లను ప్రారంభిస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల కొండపై రోజు సుమారు రెండు లక్షల మంది కి అన్న ప్రసాదం అందుతుందని, వడ లాం టి కొత్త పదార్థాలను మెనూలో చేర్చామని ఆయన తెలిపారు.
రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ అన్న ప్రసాదం పంపిణీ చేపడతామని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక పుస్తకాన్ని ఇస్తున్నట్టు వెల్లడిం చారు. సిమ్స్‌లో ఖాళీగా ఉన్న 600 పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మరింత నాణ్యతగా శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేసేందుకు ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఆలిపిరి వద్ద భద్రత కోసం కొంత ఆలస్యం అవుతుందని.. వాటి కోసం కొత్త ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటున్నామన్నారు. టీటీడీ పరిధిలోని అట వీ ప్రాంతాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తిరుమల కల్యా ణ కట్టలో అత్యాధునిక పరికరాలు వాడేలా చర్యలు చేపడతామని వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నిర్వహిస్తున్న అన్నదానానికి టీటీడీ నుంచి రూ.4 కోట్లు కేటా యించామని నాయుడు తెలిపారు.
తిరుపతిలో స్థానికంగా ఉంటున్న వాళ్లకు గతంలో నెలకోసారి శ్రీవారి దర్శనం ఉండేదని, తిరిగి ఆ దర్శనాన్ని తాము పునరుద్ధరిం చినట్టు తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో టీటీటీ ఆలయాలు ఉన్నాయని, ఈ విషయమై మిగిలిన రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశామన్నారు. మిగతా రాష్ట్రాల వారు భూమి ఇవ్వగానే ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు. తిరుమలలోని బర్డ్ హాస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు.