26-01-2026 06:19:05 PM
మందుముల పరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేసే గెలుపు మెట్లు అనిఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. రామంతపూర్ లోని శారదనగర్‌లో జన భారతి విద్య పురస్కర్ మధు ట్యూషన్ పాయింట్ లో ప్రతిభ కలిగిన విద్యార్ధులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కష్టపడి ఇష్టంతో చదివితే భవిష్యత్తులో ఉన్నతంగా జీవించవచ్చన్నారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని చేరుకునేందుకు చదవాలని పేర్కొన్నారు. అనంతరం తత్త్వ అకాడమీ ఫౌండర్ విక్రమ్ దాచేపల్లి, జూవినీలే వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ న్ మైథిలి భీమ్, విద్యారణ్య స్కూల్ కరస్పాండెంట్ ఉపేందర్ తో కలిసి కుశాల్‌చంద్ర, లాస్యప్రియాలకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయుకులు తౌఫీక్, రఫీక్, వల్లపు శ్రీకాంత్ యాదవ్, గరిక సుధాకర్, బుక్క సురేష్, శ్రీధర్, భాస్కర్, జంగయ్య, శంకర్, చింటు, సతీష్ గౌడ్, కిరణ్,అశోక్, నాగమల్లయ్య, చోటు, రామకృష్ణ, షకీల్. తదితరులు పాల్గొన్నారు.