26-01-2026 06:34:46 PM
నియోజకవర్గ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
కోదాడ: కోదాడ పట్టణంలో నియోజకవర్గ యూత్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించాలన్నారు.
ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తు అని స్పష్టం చేసిన ఆయన చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోకుండా క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడవాలని హితవు పలికారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగితేనే నిజమైన దేశసేవ జరుగుతుందని పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. చట్టాలను గౌరవిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాలాపన, దేశభక్తి నినాదాలతో వేడుకలను మరింత ఉత్సాహంగా మలిచారు. జాతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మాడుగుల సుందర్రావు, హుజూర్నగర్ పిఎస్ చైర్మన్ జక్కుల నరేంద్ర యాదవ్, చంటి, మాడుగుల రాహుల్, ప్రవీణ్, వంశీ, భాను, నీలేష్, కర్ల శివ, ఆనంద్, సాయి, పరదేశి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు