calender_icon.png 26 January, 2026 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 06:16:04 PM

​నూతనకల్,(విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై నాగరాజు, వెలుగు కార్యాలయంలో ఏపీఎం వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ కార్యాలయంలో సీఈవో సమ్మెట వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు.