26-01-2026 06:25:15 PM
వనపర్తి: వనపర్తి పట్టణంలోని భగీరథ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ట్రెండ్స్ మచ్చావస్త్రదుకానాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్ కు చెందిన యువకులు శాంతి వర్ధన్, రాహుల్లను ఎమ్మెల్యే అభినందించారు.
దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి వ్యాపార సముదాయాల ఏర్పాటు లాభదాయకంగా ఉంటుందని యువకులు ఉద్యోగ కల్పనతో పాటు ఇలాంటి ఉపాధి, వ్యాపార అవకాశాలపై కూడా దృష్టి సారిస్తే భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యువకులు చెడు మార్గాలలో కాకుండా భవిష్యత్తు బాగుండే మార్గాలను ఎంచుకొని ముందుకు నడవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.