26-01-2026 06:57:12 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జొన్నల బాలకృష్ణ (బాలు) బిఆర్ఎస్ పార్టీలో చేరిక
కండువా కప్పు పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్
రామాయంపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి
మాజీ మంత్రి హరీష్ రావు
రామాయంపేట్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సమక్షంలో మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీ చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జొన్నల బాలు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నరు. రామాయంపేట అభివృధి కోసం జొన్నల బాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ పల్లె జితేందర్ గౌడ్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, నాయకులు పుట్టి యాదగిరి, కన్నాపురం కృష్ణ గౌడ్, ఉమా మహేశ్వర్, అస్ముద్దీన్, బాసం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.