calender_icon.png 26 January, 2026 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు గ్రామాలు దత్తత తీసుకున్న సెక్రెటరీ డా.రసజ్ఞ

26-01-2026 06:31:39 PM

నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్న తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్

బెజ్జూర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతర దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో, తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీడీఎస్ ఏ)తమ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం స్వర్నోడెంట్ 2026లో భాగంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రెటరీ సామల రసజ్ఞ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాగజ్ నగర్ మండలంలోని రాస్పల్లి, పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి, బెజ్జూర్ మండలంలోని బారేగూడ, సిర్పూర్ మండలంలోని పెద్దబండ గ్రామాలను టీడీఎస్ఏ అధికారికంగా దత్తత తీసుకుంది.

ఈ గ్రామాల్లో ప్రజలకు డిజిటల్ డెంటల్ స్మార్ట్ కార్డులు, ఉచిత దంత వైద్య శిబిరాలు,ఉచిత మందుల పంపిణీ, 365 రోజులలో 24 గంటలు వైద్య సహాయం అందిస్తామని తెలిపారు.ప్రతి గ్రామానికి ఒక టీడీఎస్ ఏ సభ్యుడిని బాధ్యతగా నియమించి, ప్రజలకు నేరుగా సంప్రదించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు హరీష్ బాబు మద్దతు, ప్రోత్సాహం లభిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సేవా కార్యక్రమాన్ని హరీష్ అన్న ఆరోగ్య బాధ్యతగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, డెంటల్ విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.