calender_icon.png 26 January, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 06:45:30 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలను చేత పట్టుకొని భారీ ర్యాలీలు నిర్వహించారు.

బస్టేషన్ అవరణలో అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ యువజన సంగం అధ్యక్షులు యాస శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యాలయంలలో సర్పంచ్ మస్కురి కాశీరం, తహసిల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వరలక్ష్మి, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో స్నిగ్ద, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, సెస్ కార్యాలయంలో సెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరకొండ తిరుపతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేణు మాధవ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, బీజేపీ కార్యాలయంలో బైరాగోని సురేష్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, పీఎం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మదన్ లాల్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, జాతీయ జెండాలను ఎగురవేశారు.