26-01-2026 06:37:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): 26వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామలింగం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ మాజీ FSCS చైర్మన్, ముడుసు సత్యనారాయణ SC సెల్ అధ్యక్షులు, రమణ రెడ్డి మాజీ PACS చైర్మన్, కొప్పుల శ్రీధర్ మాజీ వైస్ చైర్మన్, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్, M. పోశెట్టి, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు, రవి కిరణ్, బంటి, కార్యకర్తలు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.