calender_icon.png 22 August, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకజనహితమే మనహితం కావాలి

22-08-2025 12:23:08 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ 

నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్ ఆగస్టు 21:(విజయ క్రాంతి): లోక్ అదాలత్ నిర్వహణలో లోక జనహితమే ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. సెప్టెంబర్ 13 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ నున్న నేపథ్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన సహచర అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, హరీష, ఆశాలత, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరి కుమార్ లతో కలిసి వచ్చి న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు.

న్యాయవాదుల అభిమతం మేరకు వారి పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను లోక్ అదాలత్ వైపు మల్లించాలని ఆమె కోరారు. కక్షిదారులు వారి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించుకోవాడానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు కీలక భూమిక నిర్వహిస్తున్నాయని ఆ దిశగా న్యాయార్థులకు ప్రేరణ కలిగించాలని ఆమె పేర్కొన్నారు. న్యాయవాదుల ప్రయోజనాలు ప్రణంగా పెట్టబోమని, ప్రాణంగా చూసుకుంటామని ఆమె తెలిపారు.

జాతిహితం కోసం మధ్య వర్తిత్వం అనే నినాదం, నినాదం కాదని న్యాయార్థుల ఉమ్మడి ప్రయోజనం దాగి ఉన్నదని ఆమె విశ్లేషంచారు. న్యాయస్తానాలలో న్యాయ విచారణకై ఉన్న న్యాయ వివాదాలను న్యాయబద్దంగా పరిష్కరించే ఉపకరణం దాగి ఉన్నదని ఆమె అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి ఉచిత న్యాయవివాద కేసు రేపటికి నిజమైన న్యాయ దావాలు కావచ్చని ఆమె విశదీకరి ంచారు.

లోక్ అదాలత్ ఒకవైపు, మధ్యవర్తిత్వం మరోవైపు అనేవి న్యాయవివాదాలను తగ్గిస్తున్న, న్యాయ చైతన్య సదస్సులతో న్యాయపరమైన సమస్యలను చట్టబద్దంగా పరిష్కరించుకోవాలనే న్యాయ చైతన్యం పెరుగుతున్నదని జిల్లాజడ్జి వివరించారు.న్యాయపాలన లేకుంటే అన్యాయమే రాజ్యం ఏలుతుందని, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలని తెలిపారు.అంతిమంగా అందరి లక్ష్యం న్యాయసేవలు త్వరితిగతిన ప్రజల దరికి చేర్చడమే కావాలని జిల్లాజడ్జి ఆశించారు.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి న్యాయవాదుల సహాయ, సహకారాలు కావాలని ఆమె అభ్యర్థించారు.న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ న్యాయమూర్తులుగా కలిసి వచ్చినం, న్యాయవాదులు చేదోడునిస్తే లోక్ అదాలత్ నిర్వహణ, విజయం,ఫలితాలు నల్లేరుపై నడకేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయరెడ్డి మాట్లాడుతు న్యాయసేవ సంస్థ వెన్నంటి నడుస్తామని తెలిపారు.కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి,సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, కృపాకర్ రెడ్డి,సంగమేశ్వర్ రావు, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు