22-08-2025 02:07:58 AM
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,623 మంది స్పెషలిస్ట్ వైద్యుల భర్తీకి రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీనికి సంబం ధించిన నోటిఫికేషన్ ఒకటి రెండు రోజు ల్లో విడుదల కానున్నది. భర్తీకి సంబంధించి ఇప్పటికే వైద్యారోగ్యశాఖ కసరత్తు పూర్తి చేసింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయ నున్నది.
వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే 8 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులనూ భర్తీ చేయాలనే నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు భర్తీ చేసిన, ఇప్పుడు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ, రానున్న నోటిఫి కేషన్‌తో వైద్యారోగ్యశాఖలో ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసినట్లవుతుంది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి వైద్యారోగ్యశా ఖలో ఇంత మొత్తంలో ఉద్యోగాల భర్తీ జరగడం ఇదే తొలిసారి.
కొనసాగుతున్న స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్ల భర్తీ ప్రక్రియ..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఆయా కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆ శాఖ 6,928 ఉద్యోగాల నియామక ప్రక్రి య చేపడుతుంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,322 స్టాఫ్ నర్స్ పోస్టులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 732 ఫార్మాసిస్ట్ పోస్టులు, 1,931 ఎంపీహెచ్‌ఎస్ (ఫీమేల్) పోస్టులు, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పో స్టులు, నలుగురు స్పీచ్ పాథాలజిస్ట్ పో స్టులు, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నది.