22-08-2025 02:25:43 AM
ఫేక్ సర్టిఫికెట్లతో 59 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 21 ( విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్‌శాఖలోనే అక్రమార్కులు పాగా వేయడం, తప్పుడు ధ్రువపత్రాలతో ఏకంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించడం తీవ్ర దుమారానికి దారితీసింది. 20 22 కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఏకంగా 59 మంది అభ్యర్థులు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలకు ఎంపికైన ట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
వీరిపై సీసీఎస్‌లో కేసు నమోదు కావడంతో ఈ వ్యవ హారం వెలుగులోకి వచ్చింది. 2022లో ఎం పికైన కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఉన్నతాధికారులు పునఃపరిశీలించగా ఈ భా రీ మోసం బయటపడింది. 59 మంది అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు నకి లీవని తేలింది. ఈ 59 మందిలో 54 మంది ఇప్పటికే కానిస్టేబుళ్లుగా శిక్షణలో ఉండటం గమనార్హం. అధికారుల ఫిర్యాదు మేరకు సీ సీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు.
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నిర్ధారణ కావడంతో, అధికారులు తక్షణ చ ర్యలకు ఉపక్రమించారు. ఫేక్ ధ్రువపత్రాలు సమర్పించిన 54 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కంచే చేను మేసిన చం దంగా, పోలీస్ శాఖలోనే నకిలీలు ఉద్యోగా ల్లో చేరడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.