01-07-2025 12:00:00 AM
నటి షఫాలీ జరీవాలా మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షఫాలీ అంత్య క్రియల కవరేజీ విషయం లో మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఈ విషయమై నటుడు వరుణ్ ధావన్ స్పందిస్తూ.. “మీరు ఎదుటి వ్యక్తి బాధను కూడా ఎందుకు కవర్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావటంలేదు.
అక్కడ షఫాలీ కుటుంబమంతా ఎంతో అసౌకర్యంగా కనిపిస్తున్నారు. ఆ సమయంలో మీ అత్యుత్సాహం వారిని మరింత బాధ పెట్టింది. దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? మీడియా స్నేహితులకు నా అభ్యర్థన ఒక్కటే. దయచేసి అంతిమ సంస్కారాలను కవర్ చేయకండి. దాన్ని కవర్ చేయాలని ఎవరూ కోరుకోరు కదా?!” అంటూ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌పై జాన్వీకపూర్ స్పందించింది. ఇప్పటికైనా ఈ విషయంపై కనీసం ఒక్కరైనా మాట్లాడారు” అంటూ క్యాప్షన్ పెట్టి వరుణ్ పోస్ట్‌కు మద్దతు తెలుపడం ద్వారా తన మీడియా తీరు విషయమై తన మనసులో ఉన్నది కూడా ఇదే అభిప్రాయమని చెప్పకనే చెప్పింది జాన్వీ.