calender_icon.png 3 July, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందేశాత్మకంగా వీడే మన వారసుడు

01-07-2025 12:00:00 AM

రమేశ్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘వీడే మన వారసుడు’. ఇందులో లావణ్యరెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లు. జూలై 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒకప్పుడు మెసేజ్ సినిమాలు వచ్చేవి.. ఆ తరహా లో ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటు న్నా” అన్నారు.

రమేశ్ ఉప్పు మాట్లాడుతూ.. “ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథాచిత్రాన్ని థియే టర్‌లో చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా” అన్నారు. “రమేశ్ ఉప్పు మంచి సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ జరిగింది.

అక్కడి మనుషులు, వాతావరణం ఎంతో బాగుండేది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకుంది” అని హీరోయిన్లు లావణ్యరెడ్డి, సర్వాణి మోహన్ చెప్పారు. హీరో కృష్ణసాయి, డైరెక్టర్లు వీఎన్ ఆదిత్య, సముద్ర, దర్శకనిర్మాత సాయి వెంకట్, పోలీసు ఆఫీసర్ రామావత్ తేజ, కాంగ్రెస్ నాయకుడు సురేందర్‌రెడ్డి, పలువురు నటీనటులు పాల్గొన్నారు.