జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ
మాజీ మంత్రి కేటీఆర్ చొరవ
రూ.5 కోట్లతో కార్పొరేట్ స్థాయి భవనం
శంకర్ పల్లి, ఆగస్టు 20 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులు రూ. 5 కోట్లతో 1,600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనాన్ని గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కలసి మంగళవారం ప్రారంభించారు.
శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఇండస్ స్కూల్ యాజమాన్యం దత్తత తీసుకుని ఏడాది వ్యవధిలోనే ఆధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించింది. ప్రైవేటు పాఠశాలలు తమ పరిసరాల్లోని ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.
బోధనకు ‘ఏఐ’ రోబోలు..
విద్యార్థులకు సులభంగా ప్ పాఠాలు చెప్పడం, సందేహాలు తీర్చడం, క్విజ్-పరీక్షలు నిర్వహించడం మరియు గణితం-సైన్స్ అంశాలను ప్రాక్టికల్గా వివరించేందుకు ఇండస్ యాజమాన్యం 3 ఏఐ రోబోలను అందించింది. బీఆర్‌ఎస్ నాయకులు గౌడచర్ల వెంకటేష్, ప్రశాంత్ యాదవ్ తమ సొంత నిధులతో 50 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.ఇంద్రారెడ్డి నగర్ నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని, గ్రామాల అభివృద్ధికి అందరూ రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య పిలుపునిచ్చారు.






