పాపన్నపేట మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
* అధ్యక్షులుగా పోతేదారి మహిపాల్
* యువజన సంఘం అధ్యక్షులుగా నాయికోటి శ్రీనివాస్
పాపన్నపేట: పాపన్నపేట మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా పోతే దారి మహిపాల్ ను ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా సుంకరి కృష్ణ, కోశాధికారిగా టప్ప రాములు, ఉపాధ్యక్షులుగా ఆకుల రంగంపేట శ్రీనివాస్, సుంకరి హరీష్, కార్యవర్గ సభ్యులుగా ఆకుల శ్రీనివాస్, సుధాకర్, పోతేదారి మల్లన్న, దుర్గాప్రసాద్, దోసని పెద్ద సంగన్న, సుంకరి కిష్టయ్యలను ఎన్నుకున్నారు. దీంతోపాటు యువజన సంఘాన్ని సైతం ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. అధ్యక్షులుగా నాయికోటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల అభిరామ్, ఉపాధ్యక్షులుగా సుంకరి సతీష్, అజయ్, కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, అనిల్ కుమార్, నితిన్, టప్ప కృష్ణ, రమేష్, దుర్గాప్రసాద్, ఆకాష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.






