6 August, 2026 | 6:26 PM

కంచర్ల–చల్మేడ రహదారికి నిధుల మంజూరు

06-08-2026 05:24 PM

భిక్కనూర్,(విజయక్రాంతి):  భిక్కనూర్ మండలం కంచర్ల–చల్మేడ గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అలీ నిధులు మంజూరు చేసినట్లు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయాగౌడ్ తెలిపారు. గ్రామ నాయకులు పలు సమస్యలను షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భీంరెడ్డి, నర్సాగౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.