6 August, 2026 | 6:39 PM

డీటీడీఓ అంబాజీకి టీఎస్ యూటీఎఫ్ నాయకుల సన్మానం

06-08-2026 05:31 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబాజీని టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి ఆశ్రమ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై డీటీడీఓ అంబాజీతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాదుల లావణ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు లైసెట్టి ప్రీతి, జిల్లా కమిటీ సభ్యులు కిరణ్, మహేష్, అనిత, నాయకులు సునీత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.