6 August, 2026 | 6:31 PM

అఖండ జ్యోతి కార్యక్రమానికి రండి

06-08-2026 05:26 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో శ్రావణమాసం లోనిర్వహించనున్న అఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ గ్రామస్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణకు ఆహ్వాన పత్రికను అందించారు. అంతేగాక మండల కేంద్రంలోని ప్రముఖులకు వ్యాపారస్తులకు ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది. కార్యక్రమంలో శబరిమాత ఆశ్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.