జిల్లాలో జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 03:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల అగ్ని చక్రవర్తి. జెసి చైర్మన్ విజయ్ కుమార్. సుబ్రహ్మణ్యం ఉద్యోగులు. టీఎన్జీవో నాయకులు. బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నేతలు వేరువేరుగా జయశంకర విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ ,ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సుద్దాల సత్యనారాయణ ,గాంధారి ప్రభాకర్, కొమ్మోజి నారాయణ, వల్లంపట్ల సత్యనారాయణ, గట్టు గంగాధర్. మరియు సంఘ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది






