6 August, 2026 | 4:13 PM

ప్రజా యుద్ధనౌక గద్దర్ కు నివాళులర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ నాయకులు

06-08-2026 03:08 PM

నసురుల్లాబాద్,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తన సాహిత్యంతో పాటలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి పాటలతో ఊపిరి పోసిన సాంస్కృతిక విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక  స్వర్గీయ శ్రీ గద్దర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేశాయిపేట ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్ నర్సింలు, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు, దుర్కి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బంగారు గంగాధర్, నర్సింలు పాల్గొన్నారు.