15 April, 2026 | 10:39 AM

ఘనంగా జాజుల జన్మదిన వేడుకలు

10-06-2025 06:37 PM

వృద్ధులకు, యాచకులకు పండ్లు పంపిణీ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలో కేక్ కట్ చేసిన అనంతరం వృద్ధులకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. 

అనంతరం బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిత్య శ్రామికుడై అలుపెరుగని పోరాటం చేస్తున్న బహుజన సూర్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  కి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ అధ్యక్షుడు విశ్వాధుల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.