calender_icon.png 16 December, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ విడుదల

15-12-2025 01:11:42 AM

అందుబాటులో 19 ఏళ్ల పాత ప్రశ్నపత్రాలు

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): వచ్చే ఏడాదిలో జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సిలబస్‌ను విడుదల చేశారు. దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2026 మే 17న జేఈఈ అడ్వాన్స్డ్- పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 5న ఈ పరీక్షకు సంబంధించిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఐటీ రూర్కీ అధికారులు..

తాజాగా పరీక్ష సిలబస్‌ను విడుదల చేశారు. ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పలు కాన్సెప్టులను కవర్ చేసేలా సిలబస్ రూపొందించారు. వీటితో పాటు అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వీలుగా అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి 2007 నుంచి 2025 వరకు (19 ఏళ్ల) పాత ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.