21-05-2025 12:00:00 AM
- కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ జీవన్‌రెడ్డి
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండి పాటు
జగిత్యాల అర్బన్, మే 20 (విజయ క్రాంతి): జగిత్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు మ రింత ముదిరిపోయాయి. ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై చేసిన కామెంట్లపై సంజయ్ స్పందించారు.
మంగళవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కని, జగిత్యాల అంటే జీవ న్...జీవన్ అంటే జగిత్యాల...అని గొప్పలు చెప్పుకుంటున్న జీ వన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసి ఎక్కువసార్లు ఓడిపోయింది తానే అనే విషయాన్ని మరిచిపోయారని ఎద్దే వా చేశారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర జీవన్ రెడ్డి దని గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగకుండా చేసింది జీ వన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తున్నానే తప్పా స్వార్థ ప్ర యోజనాల కోసం కాదన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు తన తో సన్నిహితంగా ఉండడం చూసి ఓర్వ లేకనే జీవన్ రెడ్డి తనపైఅసహనం,ఆవేశంతో మాట్లాడుతున్నారన్నారు.జగిత్యాల అ భివృద్ధిలో ప్రతి ఒక్క ప్రజా ప్రతినిది పాత్ర ఉందన్నారు.తాను జగిత్యాల నూకపల్లి లో 4520 డబల్ బెడ్ రూం ల నిర్మాణం పూర్తి చేశానని, రహదారుల నిర్మాణం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సహా పలు అభివృద్ధి పనులు తన హ యాంలోని జరిగాయని తెలిపారు.
మా శీనన్న కొడుకు అని అరవింద్ కి మద్దతు ఇచ్చి ఎంపీగా గెలిపించానని మీడియా ముఖంగా జీవన్ రెడ్డి తెలిపిన విషయం నిజం కాదా అని అన్నారు.జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలు జీవన్ రెడ్డి కి ఎ న్నడు మెజార్టీ ఇవ్వలేదని, 2014 ఎన్నికల్లో నైతికంగా గెలిచిం ది తానేనని,ఆ ఎన్నికల్లో ఇదే ఆఖరి చాన్స్, చివరి ఎన్నిక అని ప్రాధేయ పడితే కొద్ది ఓట్ల తేడాతో జీవన్ రెడ్డి గెలిచారన్నారు. 2018 లో 40శాతం ఓట్ల తో తాను ఘనవిజయం సాధించానని తెలిపారు.
గతంలో అర్ అండ్ బి మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి జేఎన్టీయూను, న్యాక్ కేంద్రాన్ని గుట్టల మధ్యలో పెట్టార ని కనీసం రహదారి కూడా వేయలేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం తో జగిత్యాల అభివృద్ధి కుం టుపడిందన్నారు.పోలాస, చల్ గల్,వ్యవసాయ క్షేత్రం,ధరూర్ క్యాంప్ జీవన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.జగిత్యాల-చల్గల్, జగిత్యాల-తిప్పన్నపెట్ 4 లైన్ల రహదారి కి తాను కృషి చేస్తున్నానని, 900 మీటర్ల తో యావర్ రోడ్డు విస్తరణ చేపట్టినట్లు తెలిపారు.
జీవన్ రెడ్డి ఇకనైనా కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.తాను ప్రజలు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే నని తనను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. జగిత్యాల ప్రజలు ఎవరు అభివృద్ధి చేశారో తెలుసుకున్నారు కాబట్టే జీవన్ రెడ్డిని ఓడించారని అన్నారు. అభివృద్ధి విషయంలో జగిత్యాలకు మీ సలహాలు అక్కరలేదని.. రాష్ట్రస్థాయి లో జాతీయస్థాయిలో మీరు సలహాలు ఇవ్వాలని సూచించా రు.
ఇకనైనా జీవన్ రెడ్డి సహనం కోల్పోకుండా మాట్లాడాల ని,తన హుందాతనాన్ని కోల్పోకుండా ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అ డువాల జ్యోతి, గిరి నాగభూషణం, నాయకులు కొలుగూరు దామోదర్ రావు,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,గుర్రాల రాజేందర్ రెడ్డి,నక్కల రవీందర్ రెడ్డి,గోలి శ్రీనివాస్,కోల శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, ముస్కు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.