21-05-2025 12:00:00 AM
రూ.24 లక్షలు గోల్‌మాల్
భద్రాద్రి కొత్తగూడెం మే 20 (విజయ క్రాంతి) తీగ లాగితే డొంక కదిలింది అంటే ఇదేనేమో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుం డాల మండల ప్రాథమిక సహకార సంఘం లో మొక్కజొన్నల అమ్మకాల్లో గోనెసంచుల పైకం కోసం రైతులు ఆందోళన చేస్తే సొసైటీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. 2020-21 నుంచి 2022-23 వరకు మార్క్ఫెడ్ ద్వా రా మొక్కజొన్న కొనుగోలు చేశారు.
మొక్కజొన్నను సొసైటీ అధికారులు కొనుగోలు చేసి మార్క్ఫెడ్‌కు సరఫరా చేశారు. ప్రభు త్వం గోన సంచుల కొరత ఉందని, రైతులు గోన సంచులతో పాటు మొక్కజొన్నని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచిం చింది. మొక్కజొన్నకు చెల్లించే డబ్బులతో పాటు గోనెసంచు డబ్బులు సైతం రైతుల ఖాతాలో వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సొంత ఖర్చులతో గోనె సంచులు కొనుగోలు చేసి మొక్కజొన్నను విక్రయించారు.
ప్రభుత్వం రైతులకు మొక్కజొన్న డబ్బు లు చెల్లించే సమయంలో కేవలం ప్రభుత్వం నిర్ధారించిన మొక్కజొన్న పైకాన్ని మాత్రమే రైతు ఖాతాలో వేయడం జరిగింది. గోనెసంచుల పైకం రాకపోవడంతో రైతుల పలుమా ర్లు సొసైటీ అధికారులతో వాదనపడ్డారు. రాలేదు వచ్చినంక ఇస్తామంటూ సుమారు నాలుగు సంవత్సరాలపాటు కాలం వెళ్ళబుచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గుం డాల,ఆలపల్లి రైతులు ఆందోళనకు దిగారు.
వాస్తవంగా ప్రభుత్వం నుంచి గోనెసంచుల పైకాన్ని రైతుల ఖాతాలో కాకుండా నేరుగా సీఈవో ఖాతాలోకి సుమారు రూ 24 లక్ష లు జమ చేయించుకున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన సీఈవో శ్రీనివాస్ రూ 8 లక్షలు, ప్రస్తుతం పని చేస్తున్న రాంబాబు రూ.16 లక్షలు కా చేసినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. రైతుల ఆందోళన చేయడం తో జిల్లా అధికారులు విచారణ అధికారాన్ని నియమించారు.
విచారణకు వచ్చిన అధికారిని మభ్యపెట్టి బ్రిడి కొట్టించారని తెలు స్తోంది. ఈ విచారణకు ఇద్దరు సీఈవోలు గైర్హాజరైనట్లు సమాచారం. ఈలోగా డిసిఒ 52 విచారణను ఆదేశించారు. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు యూరియా విక్రయాలు రూ 14: 50 లక్షలు స్వాహా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రాయితీపై యూరియా ను సరఫరా చేస్తోంది.
సొసైటీల ద్వారా రైతులకు ఎరువులు,పురుగు, మందులు విత్త నాలను సరఫరా చేయడం విధితమే. ఈ త రుణంలో కొంతమంది సొసైటీ అధికారులు ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విక్రయించి దండుకుంటున్నారని జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు ఉన్నాయి. గుండాల సొసైటీలో గత ఏడాది 199 లారీల (90,545) యూరియా ను సరఫరా చేశారు. ప్రభుత్వ నిర్ధారించిన ఎమ్మార్పీ ధర కంటే సొసైటీ సీఈఓ రూ 16 అధనంగా రైతులకు విక్రయించినట్లు తెలుస్తోంది.
దీంతో సుమారు రూ 14.50 లక్షలు నొక్కేశాడని విచారణలో తేలింది. అంటే సొ సైటీలో ఇదే తంతు సాగుతోందని వస్తున్న ఆరోపణ ఈ సంఘటనతో ధ్రువపడింది. ఎ ప్పటికైనా సొసైటీ ఉన్నతాధికారులు రైతుల ను మోసం చేస్తున్న సొసైటీ అధికారులపై ని ఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని రైతులు వేడుకుంటున్నారు.