calender_icon.png 22 May, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది

21-05-2025 12:00:00 AM

ఎంఈఓ ఉషారాణి

భూత్పూర్, మే 20 : తెలంగాణ రాష్ట్రం ప్రాథమిక విద్యలో నాణ్యతను గణనీయంగా పెంచడానికి ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్)  కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా అమలు చేస్తోందని భూత్పూర్ మండల విద్యా ధికారి  ఉషారాణి అన్నారు. మంగళవారం భూత్పూర్ హై స్కూల్లో ప్రారంభమైన కెపాసిటీ బిల్డింగ్ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించా రు.

ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయిలోనే చదవటం, రాయటం,  గణితాన్ని అర్థం చేసుకోవడంలో బలమైన పునాదిని కలిగి ఉండాలి అనేదే ఈ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం‘ అని స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను అమలు తీరును, ఆశించిన ఫలితాలను ఆమె ఉపాధ్యాయులకు వివరించారు.

ఉషారాణి అభిప్రాయం ప్రకారం, కేవలం అక్షరాస్యత , సం ఖ్యాజ్ఞానానికే పరిమితం కాదు. ఇది విద్యార్థుల  సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన పునాదిగా పనిచేస్తుందని అన్నారు. ప్రాథమిక నైపుణ్యాలు పటిష్టంగా ఉంటేనే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్యను విజయవంతంగా అభ్యసించగలరని, తద్వారా జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉం టుందని ఆమె నొక్కి చెప్పారు.

ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం SCERT (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి) ద్వారా సమర్థవంతమైన పాఠ్యప్రణాళికలను,  నూతన బోధనా విధానాలను రూపొందించిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఉపాధ్యా యుల నిబద్ధత, క్రియాశీల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. 

శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని తరగతి గదులలో సమర్థవంతంగా వినియోగించి, విద్యార్థులలో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రిసో ర్స్ పర్సన్లు, మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయు లు, సిఆర్పిలు  పాల్గొన్నారు.