1 May, 2026 | 4:06 AM

చరిత్ర సృష్టించిన జెన్సీ కనబర్

01-05-2026 01:48 AM

సానియా ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్

ఢిల్లీ, ఏప్రిల్ 30: భారత టెన్నిస్‌లో సరికొత్త సంచలనం వెలుగులోకి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో టెన్నిస్‌లో జెన్సీ కనబర్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళల టెన్ని స్‌లో దుమ్మురేపిన జెన్సీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతి చిన్న భారత వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

14 ఏళ్ల 5 నెలల వయసులోనే ఈ ఘనత సొంతం చేసుకున్న జెన్సీ దిగ్గజ ప్లేయర్ సానియా మిర్జా రికార్డును బ్రేక్ చేసింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం సానియా ఐటీఎఫ్‌డబ్ల్యూలో క్వార్టర్ ఫైనల్ చేరి రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు అమె పేరిటే ఉంది. రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే సత్తా చాటిన జెన్సీ 16వ రౌండ్‌లో సందీప్తి సింగ్‌రావును 6-3, 7-5తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.