1 May, 2026 | 3:18 AM

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

01-05-2026 01:52 AM

మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత

ముంబై, ఏప్రిల్ 30 : ఐపీఎల్‌లో పంజా బ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసింది.

ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1 కింద రియాన్ పరాగ్ లెవెల్ 1 నేరం మోపింది. ఐపీఎల్ 2026కు గానూ.. పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ నుంచి 14 కోట్ల కాంట్రాక్టు ఉంది. దీని ప్రకారం మ్యాచ్‌కు కోటి రూపాయల వరకూ అందుకుంటున్నాడు. 25 శాతం జరిమానా అంటే దాదా పు 25 లక్షలు కోత పడినట్టే. ఈనెల 28న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరాగ్.. ఈ సిగరెట్ తాగుతూ కనిపించాడు. సహచర ఆటగాళ్లు పక్కనే ఉన్నా.. అతడు ఈ పని చేసినట్లు వీడియో లో కనిపించింది.

దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. ఈ మేరకు చర్యలు తీసుకుంది. నిజానికి రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు తప్పవని అంతా భావించారు. కానీ డ్రెస్సింగ్ రూంలో ధూమపానం చేయడానికి సంబంధించి ఎటువంటి నిబంధన లేనందున జరి మానాతో సరిపెట్టినట్టు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం 2019లో ఇ- సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, పంపిణీని నిషేధించింది. చట్టం ప్రకారం.. తొలిసారి ఈ నేరానికి పాల్పడిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా లక్ష జరిమానా విధిస్తారు.