30 June, 2026 | 4:23 AM

బీజేపీ వస్తే మార్కెట్లు బూమ్!

28-05-2024 01:49 AM

న్యూఢిల్లీ, మే 27: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయనే విషయంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ప్రభుత్వాన్ని బట్టి మార్కె టింగ్ సెంటిమెంట్స్ మారుతుంటాయి. ఇక యూబీఎస్ తాజాగా కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 రికార్డు స్థాయిలో లాభా లు చవిచూస్తాయని చెబుతోంది. అయి తే ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం మార్కెట్లకు చెదు అనుభవాలు ఎదురవుతాయని జోస్యం చెబుతోంది. మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని వివరించింది. ఎన్డీయే  ప్రభుత్వానికి ముందు ఉన్న పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. భారత ఎన్నికల పొత్తులు మార్కెట్లను ఎంతగానో ప్రభావితం చేసేవని, ఇప్పుడు కూడా ఎంతో ప్రభావితం చేస్తాయని తెలిపింది. 

అయితే పలు రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ ఓటు షేర్ ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వమే కేంద్రం లో అదికారంలోకి వస్తుందని ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హెం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్లు ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేస్తోంది.