01-07-2025 01:55:45 AM
- జిల్లాలో జోరుగా ఆదివాసీల ఉద్యమాలు
- కలెక్టరేట్, ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాల ఎదుట నిరసనలు
ఆదిలాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని జిల్లాలో ఆదివాసీల ఉద్యమాలు జోరందుకున్నాయి. జీవో నెంబర్ 49 తో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాల యాల ఎదుట ఆదివాసి సంఘాల నేతలు ఆందోళనలకు దిగారు.
షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవికి దూరం చేసే విధంగా ఉన్న జిఓ 49 ను తక్షణమే రద్దు చేయాలనీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కాగజ్ నగర్-ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను గజిట్లో పేర్కొంటూ తీసుకొచ్చిన జి.ఓ.నెం.49 కుంరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్టు రద్దు చేయాలని కోరారు.
ఈ ప్రాంతం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉందన్నారు. ఇక్కడ గ్రామ సభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చలేదని, ప్రజాభిప్రాయలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కిష్టన్న, నాయకులు కొట్నాక్ సక్కు సిడం మాధవ్, మరప కిస్టు, దండంజ దాసు, స్వామి, పోచక్క, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీ సంఘం నాయకులు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఎదుట ధర్నా చేసారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి మాత్రం తనుష్ మాట్లాడుతూ కొమురం భీం కన్వర్జేషన్ రిజర్వ్ ప్రాజెక్టు వల్ల ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకులు వస్తాయన్నారు. గ్రామ సభ నిర్వహించ కుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవోను రద్దు చేయాలన్నారు.
జీవో రద్దు చేయాలి
నిర్మల్, జూన్ 30 (విజయ క్రాంతి): ఆదివాసులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 49 నిరద్దు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన సోమవారం నిరసన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో tags నాయకులు కుమ్రా భీమ్రావు తుమ్రాన్ సుభాష్, నైతం జగ్గారావు,పెంద్రం సురేందర్ తొడసం జూగాదిరావు, తొడ సం జైతు, శీను,విజయ్ నైతం లింగు తదితరులు పాల్గొన్నారు