calender_icon.png 1 July, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ప్రభుత్వ వైఫల్యమే

01-07-2025 02:22:07 AM

  1. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్

సంగారెడ్డి, జూన్ 30 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: పాశమైలారంలోని సిగాచి కెమిక ల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి ప్రభు త్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రమాద స్థలిని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో జిల్లాలో మూడు అతిపెద్ద ప్రమాదాలు జరిగాయన్నారు.

ప్రమాదం జరిగి గంటలు కావస్తున్నా ఎంత మంది కార్మికులు విధులకు వచ్చారు? ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారో స్పష్టత లేదన్నా రు. దీనికి కార్మిక శాఖ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహా రం ఇవ్వాలని డిమాండ్‌చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావుతో పలువురు బాధితులు కన్నీరు పెడుతూ ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు.