3 July, 2026 | 10:31 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

జేఎన్టీయూ స్వర్ణ పతక విజేత రమ్య చంద్రిక

03-06-2025 08:11 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈరగాని రమ్య చంద్రిక జేఎన్టీయూలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్ గా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఈ మేరకు యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma) చేతుల మీదుగా బంగారు పతకాన్ని, పీజీ పట్టాను అందుకున్నారు. రమ్యచంద్రిక తండ్రి బిక్షం గౌడ్ మహబూబాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. తమ కుమార్తె రమ్యచంద్రిక యూనివర్సిటీ టాపర్ గా నిలిచి బంగారు పతకాన్ని సాధించడం పట్ల తల్లిదండ్రులు బిక్షం సునీత ఆనందం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ సాధించిన రమ్యచంద్రికను జర్నలిస్టులు అభినందించారు.