24 April, 2026 | 5:46 PM

ఓటమి భయంతోనే కేటీఆర్‌పై దాడి

11-05-2024 03:01 AM

మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, మే 10 (విజయక్రాంతి): బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. భైంసాలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి పాల్గొని మాట్లాడారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్‌పై దాడి చేయించారని ఆరోపించారు. దేవుడి పేరుతో రాజకీయాలు  చేయడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఎంఐఎం పార్టీకి ఓటు వేసిన మాట నిజం కాదా అని అన్నారు. ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు అజయ్, రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, భూమన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.