నేడు కామారెడ్డికి ప్రియాంక, రేవంత్
11-05-2024 11:31 AM
కామారెడ్డి: కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నిర్ణయించిన జనజాతర సభ రద్దు కాగా, మధ్నాహ్నం ౩ గంటలకు ప్రియాంకగాంధీ, రేవంత్ రోడ్‌షోలో పాల్గొన నున్నారు. అనంతరం జేపీఎన్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన నున్నట్టు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ తెలిపారు. కార్యక్ర మానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని, విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.






