calender_icon.png 29 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

29-11-2025 01:13:45 AM

కొల్చారం, నవంబర్ 28 :కొల్చారం మండలం పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల మార్పు జోరుగా సాగుతుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పావులు కలుపుతున్నారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డికి కండువా కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, టిఆర్‌ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, మండల యువత విభాగం అధ్యక్షులు తణుకులపల్లి సంతోష్ రావు, మాజీ ఎంపిటిసి ఆదం, మాజీ సర్పంచ్లు ఎల్లేశం, మురళి గౌడ్, రాజా గౌడ్, మల్లేశం,ఎర్ర మల్లేశం, నాగరాజుపాల్గొన్నారు.