calender_icon.png 29 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దీక్షా దివస్’ పేరుతో బీఆర్‌ఎస్ డ్రామా

29-11-2025 01:14:36 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : తెలంగాణలో ఉనికి కోల్పోతున్న బీఆర్‌ఎస్ మరో కొత్త డ్రామాకు తెరలేపిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  విమర్శించారు. ‘దీక్ష దివస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్‌ఎస్ సిద్ధమైందని మండిపడ్డారు. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం.. కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణరాలేదు.. సోనియాగాంధీ వల్లే తెలం గాణ వచ్చిందని  స్పష్టం చేశారు.

శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ  రెండే ళ్ల ప్రజాపాలన అభివృద్ధిపై చర్చకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధ మా? అని ఆయన సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ ముగిసిన శకమ ని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని, అందుకే మౌనంగా ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ బూటకపు మాటలను ప్రజలు నమ్మవద్దని, అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ డీసీపీ కైలాష్ నేత మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదని,  మూడేళ్ల క్రితం నాటి వీడియో అని తెలిపారు. కైలాష్ నేత మాటలను తాను కూడా సమర్థించనని, ఈ విషయంపై కైలాష్ నేత ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారు.