calender_icon.png 17 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు

17-09-2025 07:29:32 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ రాజీనామా చేసి ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో అలుగుబెల్లి శేఖర్ రెడ్డి, సంపత్ రెడ్డి, యనమల నర్సింహ,పులిగిల్ల జహంగీర్, మేడబోయిన శంకర్, పులిగిల్ల జహంగీర్, మేడబోయిన శంకర్, పుల్లిగిల్ల పరుశురాములు, సోమనబోయిన నాగరాజు, యనమల సాగర్, పెంజర్ల నాగరాజు ఉన్నారు.