17-09-2025 07:25:21 PM
జనగామ,(విజయక్రాంతి): బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వము జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య , జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ బెన్షా లోమ్ లు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని అధికారులు, సంఘనాయకులతో సభకు జ్యోతిప్రజ్వలన చేసి చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. విశ్వకర్మ దైవిక శిల్పి అని, దేవతల కోసం ఆయుధాలు, నగరాలు, రధాలను సృష్టించిన సృజనాత్మకత వ్యక్తి అని ,చేతి వృత్తుల ప్రాచుర్యంలోకి తేవాలని, శ్రేయస్సు కోసం పనిముట్లు,యంత్రాలు తయారు చేసి కళాకారుల ప్రాముఖ్యత గుర్తించేందుకు పాటుబడినట్లు తెలిపారు.