calender_icon.png 17 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వకర్మ జయంతి వేడుకలు

17-09-2025 07:31:39 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యజ్ఞ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy), సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకతను, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందరూ గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, విశ్వకర్మ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.