ఉమ్మడి జిల్లా సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ ప్రారంభం
29-11-2024 01:49 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బెల్లంపల్లిలో అండర్ 17 సాఫ్ట్ బాల్ సెలక్షన్ పోటీలను ఎంఈఓ పోచయ్య ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపి చక్కని గుర్తింపు పొందాలని సూచించారు. ఈ సెలక్షన్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సెలక్షన్ లో ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో డిసెంబర్ 7,8,9 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఫణి రాజు, ఆకె నపల్లి హెచ్ఎం సాధులింగమూర్తి,సీనియర్ పిడి గోపాల్, బండి రవి, రాజ్ మహమ్మద్, చాంద్ పాషా, విద్యార్థులు పాల్గొన్నారు.






