calender_icon.png 26 October, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతూళ్లకు జోర్డాన్ వలస కార్మికులు

26-10-2025 12:02:05 AM

  1. ఫలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు కృషి
  2. సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని కార్మికుల ఆవేదన

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమి త్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసారని బీఆర్‌ఎస్ పార్టీకి, హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీ లు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పుకొచ్చారు.

తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్‌లో వార్డు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నా రు.

తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు. 

ప్రభుత్వాల బాధ్యత: మాజీ మంత్రి హరీశ్‌రావు

బతుకు తెరువు, అప్పులు తీర్చేందుకు జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మం ది బతుకులు ఆగం అవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని, మరోవైపు జోర్డాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్‌కు వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నా, రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశా రు.

ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారని, మన పిల్లల్ని మనం కాపా డు కోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడ్తా అని, వాళ్ల కోసం ప్రత్యక పాలసీ తెస్తామని, నిధులు పెడతామని చెప్పి రెండేళ్లునా హామీలను నెరవేర్చలేదన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గెలిచిన తరవాత అమలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలపెట్టుకోవడం తమ బాధ్యత అని గుర్తు చేశారు. మీరు మరిచిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ వీళ్లందరినీ స్వదేశానికి తిరిగి తీసుకువచ్చి వలస కార్మికులకు బాసటగా నిలిచిందని పేర్కొన్నారు.