26-10-2025 12:00:27 AM
కేర్ హాస్పిటల్స్‌లో రోగి కేవలం 10 రోజుల్లో కోలుకుని డిశ్చార్జ్
హైదరాబాద్, అక్టోబర్ 25: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్‌లో డాక్టర్లు నల్గొండకు చెందిన 69 ఏళ్ల యెల్లయ్యపై అరుదైన, అత్యం త క్లిష్టమైన హృదయ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు.తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర శారీరక ఇబ్బందులు ఉన్న ఈ రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ తోపాటు హై-రిస్క్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేశారు. కఠిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతమవడంతో రోగి త్వర గా కోలుకుంటున్నారు.
ఎల్లయ్య 10 రోజులకు పైగా తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో కేర్ హాస్పిటల్స్‌లో చేరారు. పరీక్షల్లో ఆయనకు బైకస్పిడ్ అయార్టిక్ వాల్వ్ తీవ్రమైన స్టెనోసిస్, గుండె బలహీనత (ఇజెక్షన్ ఫ్రాక్షన్ 20%), వాల్వ్‌పై ఇన్‌పెక్షన్ (ఇన్‌ఫెక్టివ్ ఎండోకార్డిటిస్) ఉన్నట్లు తేలింది. మొదట వైద్యులు యాంటీబయాటిక్స్, ఇనోట్రోప్స్, ఇతర చికిత్సలతో స్థిరపరచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి క్షీణించి కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపింది.
అధిక ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్డియాక్ సర్జరీ బృందం కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్‌తో పాటు బయోప్రోస్తెటిక్ వాల్వ్ ఉపయో గించి అయార్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. శస్త్రచికిత్స సమయంలో, తర్వాత రోగికి హృదయాన్ని బలప రిచే మందులు, వెంటిలేటర్ సహాయం, రక్త మార్పిడి, ప్లేట్‌లెట్స్ ఇవ్వాల్సి వచ్చింది.
శస్త్రచికిత్స అనంతరం ఆయనకు జ్వరం తగ్గింది, కాలేయం, మూత్రపిండాల పనితీరు క్రమంగా మెరుగైంది. పదవ రోజున ఆయన్ని ఆరోగ్యంగా, స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు. కాగా ఈ శస్త్రచికిత్స గురించి మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట మాట్లాడుతూ, యాక్టివ్ ఇన్‌ఫెక్షన్, బహుళ అవయవాల పనితీరు తగ్గిన రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్‌తో పాటు అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల సమిష్టి కృషిని చూపిస్తుంది. మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ, ఈ కేసు కేర్ హాస్పిటల్స్‌లో ఉన్న అధునాతన వైద్య నైపుణ్యం, జట్టుకృషికి మంచి ఉదాహరణ. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మా వైద్యులు ప్రాణాలను రక్షించేందుకు ఎప్పుడూ అదనపు కృషి చేస్తారని తెలిపారు.